ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లభిస్తున్న సమాచారం ప్రకారం తొలి వలస సామ్రాజ్యాలను స్థాపించింది శెట్టి సమయాలే నని తెలుస్తోంది. తూర్పున వున్న ఇండోనేసియా, థాయ్ లాండ్ వంటి దేశాలలో తొలి వలస సామ్రాజ్యాలను స్థాపించిన వారు శెట్టి సమయ పాలకులే. ఆ ప్రాంతాలలో ఇప్పటికీ తెలుగు మూలాలు కనిపిస్తున్నాయంటే శెట్టి సమయ పాలకులు విడిచిపెట్టిన పాదముద్రలే అవి. ప్రాచీన ప్రపంచ దేశాలతో తెలుగు వారు వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు అనడానికి అనేక ఆధారాలు లభించాయి. రోమన్ సామ్రాజ్యానికి చెందిన అనేక బంగారు నాణాలు అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే దొరికాయి.
3, మే 2015, ఆదివారం
1, మే 2015, శుక్రవారం
ప్రపంచానికే న్యాయ శాస్త్ర సూత్రాలు నేర్పించిన శెట్టి సమయాలు...(శెట్టి సమయాలు-6)
ప్రపంచానికే న్యాయ శాస్త్ర సూత్రాలు నేర్పించిన శెట్టి సమయాలు ఇంగ్లీషు పాలకుల ఒర్పులేని తనానికి, వారి కుట్రలకు బలై పోయాయి. ఎంత పెద్ద సమస్యనైనా రోజుల వ్యవధి లో శెట్టి సమయాలు పరిష్కరించేవి. భార్యా భర్తల మధ్య గొడవలోస్తే నేటి కోర్టులు విడాకులు మాత్రమే ఇస్తాయి. వారిద్దరినీ కలపడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయవు. ప్రపంచంలోని అన్ని వివాహ వ్యవస్థలలో విడాకులు వున్నాయి. ఒక్క హిందూ వివాహ వ్యవస్థ లో మాత్రమే విడాకులు అనే పదమే లేదు. తెల్ల పాలకులు వచ్చిన తరువాతనే భారతీయ చట్టాలలో విడాకులు వచ్చి చేరాయి. కానీ శెట్టి సమయాల తీర్పులు భార్యా భర్తల పంచాయితీలో కేవలం తీర్పు చెప్పే వ్యవస్థలుగానే కాకుండా వివాహ బంధాన్ని నిలబెట్టే కౌన్సిలింగ్ వ్యవస్థలుగా పని చేశాయి. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే వ్యవస్థ కాదు భారతీయులది. కోర్టులే ప్రజలవద్దకు వచ్చి తీర్పులు చెప్పిన గొప్ప వ్యవస్థ భారతీయులది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)



