3, మే 2015, ఆదివారం

తొలి వలస సామ్రాజ్యాలను స్థాపించిన శెట్టి సమయాలు (శెట్టి సమయాలు-7)


ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లభిస్తున్న సమాచారం ప్రకారం తొలి వలస సామ్రాజ్యాలను స్థాపించింది శెట్టి సమయాలే నని తెలుస్తోంది. తూర్పున వున్న ఇండోనేసియా, థాయ్ లాండ్ వంటి దేశాలలో తొలి వలస సామ్రాజ్యాలను స్థాపించిన వారు శెట్టి సమయ పాలకులే. ఆ ప్రాంతాలలో ఇప్పటికీ తెలుగు మూలాలు కనిపిస్తున్నాయంటే శెట్టి సమయ పాలకులు విడిచిపెట్టిన పాదముద్రలే అవి. ప్రాచీన ప్రపంచ దేశాలతో తెలుగు వారు వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవారు అనడానికి అనేక ఆధారాలు లభించాయి. రోమన్ సామ్రాజ్యానికి చెందిన అనేక బంగారు నాణాలు అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ లోనే దొరికాయి. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి