26, ఏప్రిల్ 2015, ఆదివారం
25, ఏప్రిల్ 2015, శనివారం
అంతర్జాతీయ వ్యాపారాన్ని ఉత్కృష్ట స్థాయికి తీసుకు వెళ్ళిన శెట్టి సమయాలు (శెట్టి సమయాలు - 4)
20, ఏప్రిల్ 2015, సోమవారం
18, ఏప్రిల్ 2015, శనివారం
కుల వ్యవస్థ అత్యంత అధునాతన వ్యవస్థ....(శెట్టి సమయం - 2)
భారత దేశం వెనుకబాటు తనానికి కారణం ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కులాలుండడమే అంటారు ఇంగ్లీషు చదువులు చదువుకున్న చాలమంది మేధావులు. ఇక్కడ కుల వ్యవస్థ నశిస్తే కానీ అభివృద్ధి చూడలేమని ఆవేశంగా ప్రసంగాలు చేస్తారు. అసలు కులవ్యవస్థ ఎలాంటి పరిస్థితిలో ఏర్పడింది అని నిశితంగా పరిశీలిస్తే కానీ దానిలోని గొప్పదనం అర్థం కాదు. భారతదేశ అభివృద్ధికి అద్భుతమైన పని విభజననే కారణం. పోటీలేని, ఇబ్బందిలేని పని విభజనను మన ఋషులు మన కొరకు ఏర్పాటు చేశారు. దీని గొప్పదనాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఇంగ్లీషు వారు దీన్ని ఎలా బ్రష్టు పట్టించాలా అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మన చరిత్రను పద్దతి ప్రకారం నాశనం చేసిందే కాకుండా కుల వ్యవస్థను మన చేతనే నాశనం చేయించడానికి పూనుకున్నారు. దానిలో భాగమే మన వెనుకబాటు తనానికి కులమే కారణం అనే ప్రచారం. మనం వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా ముందుకు పోతున్నాము. కులవ్యవస్థ లోని వాస్తవాలను బయటపెట్టే చిన్న ప్రయత్నం చేశాను తప్పులుంటే మన్నించి తగు సూచనలు అందజేస్తే సరిదిద్దుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నాను.
17, ఏప్రిల్ 2015, శుక్రవారం
మనం మరచిన మహా వ్యవస్థలు "శెట్టి సమయాలు" - 1
శెట్టి సమయాల గురించి నేను వెలువరిస్తున్న నా పరిశోధనా గ్రంధాన్ని సీరియల్ గా అందించాలన్న అలోచన వచ్చింది. తెల్లవాళ్ళు భారత దేశ చరిత్రను చాలా వక్రీకరించారు. భారతీయుల మనస్థత్వం పైన దెబ్బకొట్టే విధంగా చరిత్రను వక్రీకరించారు. దీనికి మన భారతీయులు కూడా సహకారం అందించారు, ఇంకా అందిస్తున్నారు. కానీ చరిత్ర వక్రీకరణలో వారికి చాలా అర్థం కాని వ్యవస్థలు అడ్డుపడ్డాయి. వాటి గురించి వక్రీకరించడానికి వారికి బహుశా సమయం సరిపోక పోయి వుండవచ్చు. అవి పూరించలేని ఖాళీలుగా మిగిలి పోయాయి. అలాంటి ఒక వ్యవస్థలే శెట్టిసమయాలు. వీటి గురించి చరిత్రకారులు అర్థం చేసుకోలేక పోవడం వల్ల చాలా చోట్ల తప్పులు దొర్లాయి. అలాంటి తప్పులు, పొరపాట్లు నా ఈ "శెట్టిసమయాలు" గ్రంథం (నిజానికి చాలా చిన్న పుస్తకం) సరిదిద్దగలదని ఆశిస్తున్నాను. ఈ రోజు నుండే మొదలు పెడుతున్నాను మిత్రులు పాఠకులు ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
-ధూపం అభిమన్యుడు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)









