18, ఏప్రిల్ 2015, శనివారం

కుల వ్యవస్థ అత్యంత అధునాతన వ్యవస్థ....(శెట్టి సమయం - 2)



      భారత దేశం వెనుకబాటు తనానికి కారణం ప్రపంచం లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కులాలుండడమే అంటారు ఇంగ్లీషు చదువులు చదువుకున్న చాలమంది మేధావులు. ఇక్కడ కుల వ్యవస్థ నశిస్తే కానీ అభివృద్ధి చూడలేమని ఆవేశంగా ప్రసంగాలు చేస్తారు. అసలు కులవ్యవస్థ ఎలాంటి పరిస్థితిలో ఏర్పడింది అని నిశితంగా పరిశీలిస్తే కానీ దానిలోని  గొప్పదనం అర్థం కాదు. భారతదేశ అభివృద్ధికి అద్భుతమైన పని విభజననే కారణం. పోటీలేని, ఇబ్బందిలేని పని విభజనను మన ఋషులు మన కొరకు ఏర్పాటు చేశారు. దీని గొప్పదనాన్ని తెలుసుకున్నారు కాబట్టే ఇంగ్లీషు వారు దీన్ని ఎలా బ్రష్టు పట్టించాలా అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మన చరిత్రను పద్దతి ప్రకారం నాశనం చేసిందే కాకుండా కుల వ్యవస్థను మన చేతనే నాశనం చేయించడానికి పూనుకున్నారు. దానిలో భాగమే మన వెనుకబాటు తనానికి కులమే కారణం అనే ప్రచారం.  మనం వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డిగా ముందుకు పోతున్నాము. కులవ్యవస్థ లోని వాస్తవాలను బయటపెట్టే చిన్న ప్రయత్నం చేశాను తప్పులుంటే మన్నించి తగు సూచనలు అందజేస్తే సరిదిద్దుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నాను. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి